హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీళ్లు లేక.. విద్యార్థినిల తీవ్ర ఇబ్బందులు

NRPT: పెంట్లవెల్లి కస్తూర్బా విద్యాలయంలో వారం రోజులుగా నీటి సమస్య తీవ్రంగా మారింది. మోటారు మరమ్మతులకు గురికావడంతో తాగునీరు, కనీస అవసరాలకు విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న మిషన్ భగీరథ కుళాయి నుంచి బకెట్లలో నీళ్లు తెచ్చుకుంటున్నామని విద్యార్థుల వాపోతున్నారు. కనీసం బకెట్ నీళ్లయినా ఇప్పించాలని మంత్రి జూపల్లి కృష్ణారావును కోరుతున్నారు.