హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పండుగలు సమాజంలో సోదరభావాన్ని పెంపొందించాలి'

వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను గద్వాల్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ బీ.యస్.కేశవ్ అభినందించారు. ఇందులో భాగంగా ఇవాళ వ్వవసాయ మార్కెట్‌లో ఉత్సవాల నిర్వహణను ప్రోత్సహిస్తూ ఉత్సవ కమిటీకి తన వంతు సహకారంగా ఆర్థిక సహాయాన్ని (చందాను) అందజేశారు. పండుగలు సమాజంలో ఐక్యతను సోదరభావాన్ని పెంపొందించాలని కేశవ్ పిలుపునిచ్చారు.