హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్ధన్నపేట సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన: సీఈ

WGL: వర్ధన్నపేట పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సీఈ గౌతమ్‌రెడ్డి ఆదివారం తనిఖీ చేసి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేస్తూ.. ఎల్‌నినో ప్రభావం, వర్షాల లోటుతో విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. వినియోగదారులకు అంతరాయం కలగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.