హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ వర్షానికి ఇల్లు కూలి వృద్ధ దంపతులు నిరాశ్రయులు

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన ఐత కొమురయ్య ఇల్లు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోడలునాని ఇవాళ కూలిపోయింది. ప్రమాద సమయంలో దంపతులు బయట ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. సంతానం లేని వృద్ధ దంపతులు నివాసం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. తమకు ప్రభుత్వం తక్షణ సాయం చేసి నివాసం కల్పించాలని వారు వేడుకుంటున్నారు.