KMR: మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఆదివారం కొత్త ఓటర్ల కోసం దరఖాస్తుల స్వీకరణ శిబిరం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారి, ఓటర్ల మార్పులు చేర్పులు గురించి దరఖాస్తులు స్వీకరించారు. నాలుగు విడతలుగా దరఖాస్తు స్వీకరణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు సత్యం, దినకర్ పాల్గొన్నారు.
తెలంగాణ
కొత్త ఓటర్ల కోసం దరఖాస్తుల స్వీకరణ శిబిరం


