హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ విమోచన సమరయోధులకు బీజేపీ నివాళి

HYD: 1948 సెప్టెంబర్ 13న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేపట్టిన 'ఆపరేషన్ పోలో' ద్వారా తెలంగాణ నిజాం నియంతృత్వ పాలన నుంచి విముక్తి పొంది భారత్‌లో విలీనమైంది. నాడు రజాకార్ల అరాచకాలు, హింసను తట్టుకొని నిలిచిన వీరుల త్యాగాలను స్మరిస్తూ, ట్యాంక్ బండ్‌ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు నేతృత్వంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.