హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యుత్ వైర్ల కింద ఏర్పాటు చేయవద్దు'

MNCL: విద్యుత్ వైర్ల కింద వినాయక మండపాలను ఏర్పాటు చేయవద్దని లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. విద్యుత్ వైర్ల కింద మండపాలను ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. మండపాలను సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, కరెంట్ వైరింగ్ సరిగ్గా ఉండేలా చూడాలన్నారు.