హైదరాబాద్: 28°C
తెలంగాణ

విత్తన గణపతులను పూజిద్దాం: MLA

ADB: వినాయక చవితి సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా MLA అనిల్ జాదవ్ కు ముఖరా (కే) మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ విత్తన గణపతిని ఆదివారం అందజేశారు. MLA మాట్లాడుతూ.. విత్తన గణపతులను పూజించి ఇంటి ఆవరణలోనే నిమజ్జనం చేయాలని పిలుపునిచ్చారు. దీనివల్ల విత్తనం మొలకెత్తి మొక్కగా మారుతుందని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.