హైదరాబాద్: 28°C
క్రీడలు

కెమెరామెన్‌పై సబలెంకా అసహనం

యూఎస్ ఓపెన్ టైటిల్ పోరులో సబలెంకాపై రిబకినా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర అసహనానికి గురైన సబలెంకా తన రాకెట్‌ను విరగ్గొట్టింది. ఆ సమయంలో ఆమెను కవర్ చేసేందుకు వెళ్లిన కెమెరామెన్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ ఓటమితో 99 వారాలుగా తన వద్దే ఉన్న అగ్రస్థానాన్ని సబలెంకా కోల్పోయింది.