హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీపీఎం కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం

KMM: నేలకొండపల్లి సీపీఎం పార్టీ కార్యాలయంలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సిపిఎం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిపుణులైన వైద్యులు స్థానికులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేసి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు CPM నాయకులు పాల్గొన్నారు.