హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిడుగుపాటుతో రెండు పాడి గేదెలు మృతి!

SRPT: తుంగతుర్తి మండలం ఏనేకుంట తండాలో పిడుగుపాటుతో రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ఏనెకుంటతండాకి చెందిన బానోతు సీతారాం పాడి గేదెలను తన వ్యవసాయ బావి వద్ద కట్టేసి ఉంచగా రాత్రి కురిసిన వర్షానికి పిడుగులు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాయని, సుమారు రెండు గేదెలకు రూ1.50 లక్షల విలువ ఉంటుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు సీతారాం కోరారు.