హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ మట్టి తరలింపుపై పోలీసుల దాడి

JN: బచ్చన్నపేట(M)ఆలింపూర్‌ శివారులో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న ఐదు వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. శనివారం అర్ధరాత్రి సమాచారం మేరకు తనిఖీలు చేపట్టి ఒక హిటాచీ, నాలుగు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం వాహనాలు, బాధ్యుల వివరాలను MROకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ మట్టి, ఇసుక రవాణాపై సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.