BHPL: జిల్లా కేంద్రంలోని ఫైంక్లైన్ ఆర్చీ సమీపంలో ఇవాళ ఉదయం బొగ్గు లారీ అదుపుతప్పి డ్రైనేజీ కెనాల్లోకి దూసుకెళ్లింది. కేటీకే-5 ఇంక్లెన్ నుంచి బొగ్గు లోడుతో వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు అని సమాచారం. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అదుపుతప్పి డ్రైనేజీల్లోకి దూసుకెళ్లిన బొగ్గు లారీ


