MNCL: కన్నెపల్లి మండలం వీరాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆదివారం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరద ప్రవాహం పెరగడంతో మత్తడి దూకుతూ నీరు ఉధృతంగా దిగువకు ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పరిసరాల్లోకి వెళ్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
VIDEO: నిండుకుండలా వీరాపూర్ ప్రాజెక్ట్


