హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీలో గుర్తుతెలియని మృతదేహం కలకలం!

NZB: ముప్కాల్ (M) కొత్తపల్లి-ముప్కాల్ బైపాస్ రోడ్డులో కొత్తపల్లి సర్వీస్ రోడ్డు వద్ద డ్రైనేజీలో ఆదివారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభించింది. మృతుడి వయసు సుమారు 60-65 ఏళ్లుంటుందని స్థానికులు పేర్కొన్నారు. ఎరుపు రంగు టీషర్ట్, ప్యాంట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. ఎస్సై కిరణ్ పాల్ మృతుడి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.