హైదరాబాద్: 28°C
వార్తలు

దక్షిణాఫ్రికాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు

AP: స్పీకర్ అయ్యన్న పాత్రుడు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నారు. కేప్‌టౌన్ వేదికగా నేటి నుంచి 18 వరకు జరిగే 69వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. శనివారమే సౌతాఫ్రికా చేరుకున్న అయ్యన్న.. నెల్సన్‌ మండేలా నివాసాన్ని, మ్యూజియాన్ని సందర్శించారు. జోహన్నెస్‌బర్గ్‌ సమీపంలోని ప్రసిద్ధ లయన్‌ అండ్‌ సఫారీ పార్కును కూడా సందర్శించారు.