SDPT: కొండపాక మండలంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఏఈ సత్యం సూచించారు. వర్షాల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు విద్యుత్ స్తంభాలు, తీగల వద్దకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత లైన్మెన్‌కు సమాచారం అందించాలని కోరారు.
తెలంగాణ
'వర్షాల్లో విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తం'


