ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఈనెల 16న నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్ మేళాను వచ్చే నెలకు వాయిదా వేసినట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ 16వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున మరికొన్ని కార్యక్రమాలు వల్ల జాబ్ మేళా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో మరింత పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని యువతకు తెలిపారు.
తెలంగాణ
VIDEO: వచ్చే నెలకు మెగా జాబ్ మేళా వాయిదా..!


