హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మద్య నిషేధం.. గ్రామస్తుల తీర్మానం

ADB: భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామంలో ఆదివారం సర్పంచ్ అశోక్ అధ్యక్షతన గ్రామస్తులు ప్రత్యేక సమావేశం నిర్వహించి, సోమవారం నుంచి గ్రామంలో మద్య నిషేధం అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. మద్యంతో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని, యువత చెడుదారి పట్టకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో గ్రామస్తులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు.