హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వానంగా రోడ్లు.. ప్రజలకు అవస్థలు..!

MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డు సుబ్బారావుపల్లి రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షం పడితే రహదారులు బురదమయంగా మారడంతో వాహనదారులు,స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కనీస రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మారుమూల గ్రామాన్ని తలపిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా రోడ్ల నిర్మాణానికి నోచుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.