BHPL: గోరికొత్తపల్లి(M) నిజాంపల్లిలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంపులుగా సంచరిస్తున్న కోతులు ఇళ్లు, దుకాణాల్లోకి చొరబడి ఆహారం కోసం వస్తువులను చిందరవందర చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి కోతులను నియంత్రించే చర్యలు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
కోతుల బెడదతో ప్రజల ఇక్కట్లు


