హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాగితీగల స్థానంలో అల్యూమినియం..!

TPT: దొరవారిసత్రం మండలంలో ఇటీవల ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో రాగితీగల స్థానంలో అల్యూమినియం తీగలను వినియోగిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ట్రాన్స్‌ఫార్మర్లలో రాగితీగలు ఉండటంతో వాటిని దొంగలు అపహరించేవారు. ప్రస్తుతం అల్యూమినియం తీగల వినియోగంతో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలకు అడ్డుకట్ట పడుతుందని రైతులు తెలిపారు.