హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఊరకొండ వద్ద ఆవుపై పెద్దపులి దాడి

ప్రకాశం: దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం అటవీ ప్రాంతంలోని ఊరకొండ వద్ద ఆవుల మందపై పెద్దపులి దాడి చేసింది. మేత కోసం అటవీప్రాంతానికి వెళ్లిన ఓ ఆవుపై పులి దాడి చేయడంతో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. కాపరులు గట్టిగా కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. ఘటనపై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు.