కర్నూలులో ఈనెల 16న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసఫ్ పీజీ కళాశాలలో జరిగే మేళాలో వివిధ రంగాల్లో 1,053 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు హాజరుకావాలన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
యువతకు మంత్రి టీజీ భరత్ శుభవార్త


