KDP: పులివెందుల పట్టణంలోని ఓ దుకాణంలో రూ.75 వేల విలువైన 25 కిలోల రాగి తీగ చోరీకి గురైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ పురుషోత్తమరాజు తెలిపారు. రెండు నెలల క్రితం జరిగిన ఈ చోరీలో దుకాణంలో పనిచేసే రాజా ప్రమేయం ఉందని యజమాని సురేష్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దుకాణంలో రాగి తీగ చోరీ.. కేసు నమోదు


