హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం నుంచి 25,650 క్యూసెక్కుల నీటి విడుదల

NDL: శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి గత 24 గంటల్లో 25,650 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడుకు 8 వేలు, హెచ్‌ఎన్‌ఎస్ఎస్‌కు 3,450, ముచ్చుమర్రి కేసీసీకి 720, ఎడమగట్టు విద్యుత్ కేంద్రానికి 8,227 క్యూసెక్కులు వదిలారు. 153 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. డ్యామ్ నీటిమట్టం 863.60 అడుగులు, ప్రస్తుతం నిల్వ 117.4872 టీఎంసీలుగా ఉంది.