BDK: వినాయక చవితి పండుగ సెలవు సందర్భంగా సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజావాణిని రద్దు చేసినట్లు సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట తెలిపారు. పండుగ కావడంతో రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.
తెలంగాణ
రేపు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి రద్దు


