JN: రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బోరు మోటార్ కేబుల్స్‌ను ఎత్తుకెళ్లారు. గండి కింద ప్రాంతానికి చెందిన రైతులు వంగాల కనకరాజు, కర్ణాకర్, బక్క చేరాలు, కుమార్, బక్క మల్లయ్యల కేబుల్స్ చోరీకి గురయ్యాయి. దీంతో సుమారు రూ.15 వేల నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. దొంగలను పట్టుకొని తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.
తెలంగాణ
రైతుల కేబుల్ వైర్లు చోరీ


