WGL: GWMC 19వ డివిజన్ పరిధి కాశిబుగ్గ వివేకానంద కాలనీలో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులుగా సంచరిస్తూ ఇంట్లోకి చొరబడి తినుబండారాలు ఎత్తుకెళ్తున్నాయని, పూలమొక్కలను నాశనం చేస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయటకు రావాలంటే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు భయపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వానరాల బెడద తీర్చాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: కాశిబుగ్గలో ఇళ్లలోకి చొరబడుతున్న కోతులు


