హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించిన సెస్ డైరెక్టర్

SRCL: ఎల్లారెడ్డిపేట, మండల కేంద్రంలో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, ఏఎంసీ ఛైర్మన్ షేక్ సబేరా బేగం ప్రారంభించారు. దీంతో పోలీస్ స్టేషన్ ట్రాన్స్‌ఫార్మర్ పై భారం తగ్గి, చుట్టుపక్కల తక్కువ వోల్టేజీ సమస్య తీరుతుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని, సమస్యలుంటే దృష్టికి తేవాలన్నారు.