MBNR: న్యూ బాలాజీ నగర్‌లో ఇంటి యజమాని రాఘవేందర్ బాబు 'లంబాడా కులస్థులకు ఇల్లు అద్దెకు ఇవ్వబడదు' అంటూ బోర్డు పెట్టారు. ఈ ఘటనపై బంజారా సేవాదళ్, గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. కుల వివక్షపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తెలంగాణ
అద్దె ఇంటి బోర్డుపై కుల వివక్ష!


