హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారిపై లైంగికదాడికి యత్నం..!

RR: యాచారం మండల పరిధిలోని ఓ గ్రామంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక దాడికి యత్నించిన 35ఏళ్ల వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నాలుగో తరగతి చదువుతున్న ఆ బాలికపై ఎదురింటి వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో చిన్నారి కేకలు వేయగా స్థానికులు కాపాడారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.