హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు అఫ్గాన్‌తో భారత్‌ తొలి T20

ఆసియా క్రీడల ముంగిట టీమిండియా T20 సమరానికి సిద్ధమైంది. అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా ఇవాళ తొలి T20 జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు.. పొట్టి ఫార్మాట్‌లో అఫ్గాన్‌తో అప్రమత్తంగా ఆడి సిరీస్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది.