హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతులు లేకుండా ఇసుక తరలింపు.. ట్రాక్టర్లు పట్టివేత

NLG: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. శనివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కల్వెలపాలెం నుంచి వస్తున్న ట్రాక్టర్లను తనిఖీ చేయగా ఇసుక ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్లు గణేశ్, గురుస్వాములను అదుపులోకి తీసుకుని, తదుపరి చర్యల కోసం మైనింగ్ శాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.