MDK: ఏడుపాయల ఫస్ట్ బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో చిన్నచింతకుంటకు చెందిన గొల్ల అనిల్ కుమార్(22) మృతి చెందాడు. అతివేగంతో స్కూటీ అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


