హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారికి బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ

AP: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వేదపండితులు, అర్చకులు రేపు అంకురార్పణ చేయనున్నారు. పుట్టమట్టిని సేకరించి యాగశాలలో నవధాన్యాలు పోసి భూమిపూజ చేస్తారు. ఈనెల 15వ తేదీ నుంచి 23 వరకు ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. 19న గరుడ సేవ, 20న స్వర్ణ రథోత్సవం, 23న చక్ర స్నానం ఉంటాయి. బ్రహ్మోత్సవాల కాలంలో ఆర్జిత సేవలను, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.