MDK: నిజాంపేట మండల శివారులోని చిరుకవాగు వద్ద శనివారం కారు లారీని ఢీకొన్న ప్రమాదం జరిగింది. సిద్దిపేట నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న కారు (AP 09 CP 9973) అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం..దంపతులకు గాయాలు


