హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడే మహిళల ఆసియాకప్‌ ఫైనల్‌

మహిళల ఆసియా కప్‌ టీ20 టోర్నీలో భాగంగా ఇవాళ టీమిండియా జట్టు శ్రీలంకతో ఫైనల్‌కు సిద్ధమైంది. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఈ టోర్నీ నిర్వహించగా ఏడు సార్లు ట్రోఫీ చేజిక్కించుకున్న టీమిండియా.. ఎనిమిదో టైటిల్‌పై గురి పెట్టింది. హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని భారత జట్టు గ్రూప్‌ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది.