హైదరాబాద్: 28°C
క్రీడలు

సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు

పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో విజయం పొందింది. ఈ మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్.. టెస్టుల్లో అత్యధిక అర్ధశతకాల(69) రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో ఈ రికార్డు సచిన్(68) పేరిట ఉంది. అలాగే 4 వేర్వేరు మైదానాల్లో వెయ్యికిపైగా టెస్టు పరుగులు సాధించిన అరుదైన ఘనతను కూడా రూట్ సొంతం చేసుకున్నాడు.