హైదరాబాద్: 28°C
క్రీడలు

అందుకే నా పేస్‌ తగ్గింది: సిరాజ్

శ్రీలంక పర్యటన నుంచి టీమిండియా పేసర్ సిరాజ్ పేస్ 130కి.మీ లోపునకు తగ్గిపోయింది. అంతకుముందు అతడు 140కి.మీ పై వేగంతో బౌలింగ్ చేసేవాడు. అయితే, తన పేస్ తగ్గడానికి రెండు నెలల సుదీర్ఘ విరామమేనని కారణం అని సిరాజ్ వెల్లడించాడు. విరామం తర్వాత నేరుగా మ్యాచ్ ఆడడం వల్ల మంచి లయతో బౌలింగ్ చేయలేకపోయినట్లు తెలిపాడు. అయితే, దులీప్ ట్రోఫీతో తన బౌలింగ్ గాడిన పడినట్లు చెప్పాడు.