హైదరాబాద్: 28°C
క్రీడలు

కుల్‌దీప్‌లోకి షేన్ వార్న్ వచ్చాడా?

టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. యార్క్‌షైర్ తరఫున బరిలోకి దిగిన అతడు ఎసెక్స్‌పై పది వికెట్లు తీశాడు. అయితే, ఓ ఓవర్‌లో అతడు వేసిన బంతి క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్‌ను గుర్తుకు తెచ్చింది. ఆఫ్ స్టంప్‌కు ఆవల విసిరిన బంతిని బ్యాటర్ జమాన్ వదిలేశాడు. కానీ, ఆ బంతి నేరుగా స్టంప్స్‌ను పడగొట్టింది.