హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఆసియా కప్-2027కు నేపాల్ అర్హత

ACC మెన్స్ ప్రీమియర్ కప్-2026 ఛాంపియన్‌గా నేపాల్ నిలిచింది. UAEతో ఫైనల్‌లో గెలిచి టైటిల్ సాధించింది. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్‌కు క్వాలిఫై అయింది. బంగ్లా వేదికగా ODI ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘానిస్తాన్, నేపాల్ తలపడనున్నాయి. జూన్ 18-జూలై 4 వరకు మ్యాచులు జరగనున్నాయి. 2027 ODI WCకి వార్మప్‌లా ఉపయోగపడనుంది.