ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వినియోగదారులకు మరో షాకిచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీలపై అదనంగా రూ.5 ఛార్జీలు విధించింది. ఫుడ్ ఆర్డర్లపై ప్లాట్‌ఫాం ఫీజు, GST, రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జీలను వసూలు చేస్తుంది. కాగా, ఇటీవల తన ప్లాట్‌ఫాం ఫీజును జొమాటో పెంచిన విషయం తెలిసిందే. వినియోగదారుడి ఒక్కో ఆర్డర్‌కు ఫీజును రూ.12.50 నుంచి రూ.14.90కి పెంచింది.


