హైదరాబాద్: 28°C
వ్యాపారం

టాటా సన్స్‌ NBFC సరెండర్‌ లైసెన్స్‌ రద్దు!

టాటా సన్స్ తన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (NBFC) లైసెన్స్‌ను స్వచ్ఛందంగా రద్దు చేసుకొనేందుకు పెట్టుకున్న దరఖాస్తును RBI రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కంపెనీ అప్పర్‌ లేయర్‌ NBFC నిబంధనలకు కట్టుబడి ఉండాల్సి ఉంది. లేఖను కంపెనీ అందుకున్నట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. వార్తలపై RBI, టాటా సన్స్‌ అధికారికంగా ప్రకటన చేయలేదు.