TG: ఖమ్మం- దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పెనుబల్లి మండలం వెంకటాపురం వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి


