హైదరాబాద్: 28°C
క్రైమ్

అగ్నిప్రమాదం.. ఆందోళనకు గురైన ప్రజలు

AP: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సర్వేపల్లిలోని విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇంధన పరిశ్రమ ట్యాంక్ వద్ద మంటలు చెలరేగాయి. మంటలు చూసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కార్మికులకు ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.