AP: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో దారుణం చోటుచేసుకుంది. మేకలు కాస్తున్న మహిళను పొదల్లోకి లాక్కెళ్లి ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో తల, నుదురు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పోలవరం కాలు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
క్రైమ్
మహిళపై అత్యాచారయత్నం.. ఆపై దాడి


