హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

AP: అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతిచెందారు. మృతులను వజ్రకరూరుకు చెందిన జైనుల్లా, మహబూబ్‌బాషా, బాషాగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.