VSP: గణేష్ మండపాల ఏర్పాటుకు ఎటువంటి ఆంక్షలు లేకుండా వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ.. బీజేపీ నాయకులు గాజువాక పోలీస్ స్టేషన్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు, గాజువాక సీఐ వాసునాయుడులను కలిసి తమ విజ్ఞప్తిని సమర్పించారు. ఉత్సవ నిర్వాహకులకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నాయకులు పోలీస్ అధికారులను కోరారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ మండపాలపై ఆంక్షలు వద్దు: బీజేపీ


