PPM: చాలా సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని వెంటనే రెగ్యులర్ చేయాలని పార్వతిపురం జిల్లా ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఈపీఎఫ్, బదిలీల సౌకర్యం కల్పించాలని కోరుతూ.. శనివారం సీఎం ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రాలు పంపారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కాంట్రాక్టు నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది నిరసన


